• facebook
  • whatsapp
  • telegram

గురుకుల కళాశాలల్లో ఐఐటీ, నీట్‌ అకాడమీలు 

ఈనాడు, అమరావతి: గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలోని జూనియర్‌ కళాశాలల్లో ఐఐటీ, నీట్‌ అకాడమీలను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు. రాష్ట్రంలోని రెండు ప్రాంతాల్లో రూ.8 కోట్లతో వీటిని ఏర్పాటు చేస్తామని, వీటిల్లో విద్యార్థులకు ఐఐటీ, నీట్‌ ప్రత్యేక శిక్షణ అందిస్తామని వెల్లడించారు. బుధవారం జరిగిన గురుకుల విద్యాలయాల సంస్థ పాలకవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో నాలుగు విద్యా సంస్థలను అత్యున్నత కేంద్రాలుగా తీర్చిదిద్దనున్నట్లు వెల్లడించారు. కొత్త పోస్టుల మంజూరుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని, బోధన, బోధనేతర సిబ్బంది పదోన్నతులు, బదిలీలకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.