• facebook
  • whatsapp
  • telegram

ఎంసెట్‌ దరఖాస్తుల్లో తప్పుల సవరణకు అవకాశం

ఈనాడు, అమరావతి: ఎంసెట్‌తో సహా ఇతర ఉమ్మడి ప్రవేశ పరీక్షల దరఖాస్తుల్లో తప్పుల సవరణకు అభ్యర్థులకు అవకాశం కల్పించినట్లు ఉన్నత విద్యామండలి ప్రత్యేక అధికారి సుధీర్‌రెడ్డి తెలిపారు. ఎంసెట్‌కు జులై 4 నుంచి 7వ తేదీ వరకు, ఈసెట్‌, లాసెట్‌, ఎడ్‌సెట్‌లకు 7 నుంచి 10వ తేదీ వరకు సమయం ఇచ్చినట్లు వెల్లడించారు. ఐసెట్‌, పీజీఈసెట్‌లకు 10 నుంచి 13 వరకు, పీఈసెట్‌కు 15 నుంచి 18వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో తప్పులను సరిదిద్దుకోవచ్చని సూచించారు. ఎంసెట్‌కు 2,71,598, ఈసెట్‌కు 36,274, ఐసెట్‌-64,690, పీజీఈసెట్‌-27,057, లాసెట్‌-16,028, ఎడ్‌సెట్‌ 13,521, పీఈసెట్‌కు 2,578 దరఖాస్తులు వచ్చాయన్నారు.