• facebook
  • whatsapp
  • telegram

 పీజీ వైద్య విద్యార్థుల అఫిడవిట్లు ఇచ్చి చేరాలనడం అన్యాయం

ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం, న్యూస్‌టుడే: రాష్ట్రంలోని ప్రైవేటు వైద్య, దంత కళాశాలల యాజమాన్యాలు  నెల రోజుల తర్వాత షరతులకు ఒప్పుకొని అఫిడవిట్లు ఇస్తే విద్యార్థులకు ప్రవేశాలు కల్పిస్తామని బహిరంగ లేఖ రాయడంపై పీజీ వైద్య విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫీజులు ఖరారు కాకుండా అఫిడవిట్లు ఇవ్వాలనడం అన్యాయమన్నారు. గత 10 రోజులుగా ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం ముందు నిరాహారదీక్ష చేస్తున్న పీజీ వైద్య విద్యార్థులు బుధవారం విలేకరులతో మాట్లాడారు. తమ ముందు (2017-20) బ్యాచ్‌ విద్యార్థులు ఒప్పంద పత్రాలిచ్చి మూడేళ్లుగా కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని చెప్పారు. ఎటువంటి షరతులు లేకుండా కళాశాలల్లో చేర్చుకోవాలని ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం మరోసారి ఆదేశాలు పంపింది. ఈ మేరకు రిజిస్ట్రార్‌ డాక్టర్‌ కె.శంకర్‌ పేరిట బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.