• facebook
  • whatsapp
  • telegram

సివిల్స్‌ పరీక్ష కేంద్రాలు మార్చుకోవచ్చు

ఈనాడు, హైదరాబాద్‌, దిల్లీ: సివిల్స్‌ పరీక్షలు రాసే అభ్యర్థులు.. తమ పరీక్ష కేంద్రాల (నగరాలు)ను మార్చుకునేందుకు యూపీఎస్‌సీ అవకాశం కల్పించింది. కరోనా పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంది. కమిషన్‌ వెబ్‌సైట్‌లో  జులై 7-13, 20-24 తేదీల మధ్య నగరాలను మార్చుకోవచ్చని తెలిపింది. ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌ మెయిన్‌ పరీక్షకు కూడా ఇది వర్తిస్తుంది. అక్టోబరు 4న సివిల్స్‌ ప్రాథమిక పరీక్ష, వచ్చే ఏడాది జనవరిలో ప్రధాన పరీక్ష జరగనుంది.