• facebook
  • whatsapp
  • telegram

గిరిజన యువతకు డిజిటల్‌ సాంకేతికతపై శిక్షణ

ఈనాడు, హైదరాబాద్‌: గిరిజన యువతకు డిజిటల్‌ సాంకేతికతపై శిక్షణకు కేంద్ర గిరిజన శాఖ, ఫేస్‌బుక్‌ సంస్థ సంయుక్తంగా ‘గోల్‌’ (గోయింగ్‌ ఆన్‌లైన్‌ యాజ్‌ లీడర్స్‌) పేరిట కార్యక్రమాన్ని ప్రారంభించింది. దేశవ్యాప్తంగా 5 వేల మంది గిరిజన యువతకు శిక్షణ ఇవ్వడంతో పాటు ఇంటర్న్‌షిప్‌ కల్పించనుంది. ఇందుకు 18-35 ఏళ్లలోపు యువత ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోవాలని కోరుతోంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు goal.tribal.gov.in వెబ్‌సైట్‌ ద్వారా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని రాష్ట్ర గిరిజన గురుకులాల సొసైటీ కార్యదర్శి ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు. వ్యాపారం, విద్య, ఆరోగ్యం, రాజకీయాలు, పారిశ్రామిక, కళలు, పరిశోధన, లైఫ్‌ స్కిల్స్‌ తదితర రంగాల్లో శిక్షణ ఉంటుందని పేర్కొన్నారు. ఆయా రంగాల్లో శిక్షణ ఇచ్చేందుకు ఏకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాల ప్రిన్సిపాళ్లు, ఉపాధ్యాయుల నుంచి కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి కలిగినవారు పూర్తి వివరాలకు  facebook-goal@tribal.gov.in లో మెయిల్‌, వెబ్‌సైట్‌ ద్వారా సంప్రదించవచ్చు.