• facebook
  • whatsapp
  • telegram

నీట్, జేఈఈ పరీక్షల నిర్వహణపై సమీక్ష

దిల్లీ: ప్రస్తుత పరిస్థితుల్లో నీట్, జేఈఈ పరీక్షలు నిర్వహించేందుకు ఉన్న అవకాశాలపై సమీక్షిస్తున్నామని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేష్‌ పోఖ్రియాల్ జులై 2న‌ తెలిపారు. జులైలో ఈ పరీక్షలు నిర్వహిస్తామనడంపై విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ నిపుణులతో సమీక్ష జరిపామని, తగిన సూచనలతో జులై 3 నాటికి నివేదిక అందిస్తారని మంత్రి చెప్పారు. షెడ్యూలు ప్రకారం నీట్‌ పరీక్ష జులై 26న, జేఈఈ పరీక్ష జులై 18-23 తేదీల్లో జరగాల్సి ఉంది.