• facebook
  • whatsapp
  • telegram

సీపెట్‌లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

చర్లపల్లి, న్యూస్‌టుడే: హైదరాబాద్‌ నగరం చర్లపల్లి పారిశ్రామికవాడలో ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థ సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్లాస్టిక్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ టెక్నాలజీ (సీపెట్‌) పలు కోర్సులలో ప్రవేశానికి జులై 4న నోటిఫికేషన్‌ విడుదల చేసింది. డిప్లొమా, పోస్ట్‌ డిప్లొమా, పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి ఆసక్తి గల అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతోంది. ఆన్‌లైన్‌లో దరఖాస్తులకు జులై 31 చివరి తేదీ. ఆగస్టు 5న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు.