• facebook
  • whatsapp
  • telegram

19న ఆన్‌లైన్‌ మాక్‌ ఎంసెట్‌

ఈనాడు, అమరావతి: కంప్యూటర్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా, ఎక్స్‌ప్లోర్‌ సంస్థ సంయుక్తంగా నిర్వహించనున్న ఎంసెట్‌ ఆన్‌లైన్‌ మాక్‌టెస్ట్‌ పోస్టర్‌ను మంత్రి ఆదిమూలపు సురేష్‌, ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ హేమచంద్రారెడ్డి ఆవిష్కరించారు. జులై 19న ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ పరీక్ష నిర్వహించనున్నారు. 20న ఫలితాలు వెల్లడిస్తారు. విద్యార్థులు జులై 18లోపు www.csihyderabad.org/eamcet, www.eamcet.xplore.co.in రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని నిర్వాహకులు సూచించారు.