• facebook
  • whatsapp
  • telegram

పీజీ వైద్య విద్యార్థులకు ఊరట

ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం, న్యూస్‌టుడే: రాష్ట్రంలోని ప్రైవేట్‌ కళాశాలల్లో పీజీ వైద్య విద్యార్థుల ప్రవేశాలకు అడ్డంకులు తొలగిపోయాయి. విజయవాడలోని ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం మధ్యవర్తిత్వంతో ప్రైవేట్‌ వైద్య కళాశాలల యాజమాన్యాలు, పీజీ వైద్య విద్యార్థుల మధ్య ఒప్పందం కుదిరింది. కళాశాలల్లో జులై 10వ తేదీలోగా చేరాలని గడువు విధించారు. ఎన్టీఆర్‌ వర్సిటీ వీసీ డాక్టర్‌ శ్యామ్‌ప్రసాద్‌, రిజిస్ట్రార్‌ శంకర్‌ ఆధ్వర్యంలో సోమవారం జరిగిన చర్చలు ఫలించాయి. ఫీజుల అంశం ప్రస్తుతం హైకోర్టులో ఉన్నందున తుది తీర్పు మేరకు నిర్ణయించిన రుసుములు చెల్లిస్తామని విద్యార్థులు అంగీకార పత్రాలు ఇస్తే కళాశాలల్లో చేర్చుకుంటామని యాజమాన్య సంఘం నిబంధన పెట్టింది. విశ్వవిద్యాలయం, విద్యార్థులు అంగీకరించడంతో ప్రవేశాల విషయంలో ఏర్పడిన వివాదం తొలగిపోయింది.