• facebook
  • whatsapp
  • telegram

ఆన్‌లైన్‌లో ఇంటర్‌ పునఃమూల్యాంకనం

ఈనాడు, హైదరాబాద్‌: ఇంటర్‌ జవాబు పత్రాల పునఃమూల్యాంకనాన్ని ఆన్‌లైన్‌ విధానంలో పూర్తి చేయాలని ఇంటర్‌బోర్డు నిర్ణయించింది. కరోనా కారణంగా సబ్జెక్టు నిపుణులు ఇంటర్‌బోర్డుకు వచ్చి మూల్యాంకనం చేసే పరిస్థితి లేకపోవడం, ఇంటర్‌బోర్డులో పలువురు ఉద్యోగులు కరోనా బారినపడటంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. జవాబుపత్రాల పునఃమూల్యాంకనానికి  59,651, పునఃలెక్కింపునకు 14,333 దరఖాస్తులు అందాయి. ఈ విధానంలో.. అధికారులు జవాబుపత్రాలను స్కానింగ్‌ చేసి సబ్జెక్టు నిపుణుల ఇళ్లకే పంపిస్తారు. వాటిని వారు పరిశీలించి బోర్డుకు పంపిస్తే.. బోర్డు అధికారులు వాటిని మళ్లీ మరో నిపుణుడికి పంపిస్తారు. ఇలా.. ఈ ప్రక్రియను జులై 20వ తేదీ వరకు పూర్తి చేసి కొత్త మార్కులు ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు.