• facebook
  • whatsapp
  • telegram

ఆన్‌లైన్‌లో ‘మేడ్చల్‌ బడి’

* రికార్డు చేసిన పాఠాలతో వెబ్‌సైట్‌ ప్రారంభం


ఈనాడు, హైదరాబాద్‌: కరోనా నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని మేడ్చల్‌ జిల్లా విద్యాశాఖ వినూత్న ఆలోచన చేసింది. రాష్ట్రంలోనే తొలిసారిగా రికార్డు చేసిన పాఠాలతో ‘మేడ్చల్‌ బడి’ పేరిట ప్రత్యేక వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తెచ్చింది. జిల్లా విద్యాశాఖాధికారిణి విజయకుమారి ఆలోచన మేరకు రూపొందించిన ఈ సైట్‌ను జులై 6న మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా కలెక్టర్‌ వి.వెంకటేశ్వర్లు ప్రారంభించారు. 6 నుంచి పదోతరగతి వరకు అన్ని సబ్జెక్టుల పాఠాల వీడియోలు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి. తొలుతగా 8, 9, 10 తరగతులకు సంబంధించి పాఠాలను అందుబాటులో ఉంచారు. త్వరలోనే 6, 7 తరగతులకు సంబంధించి పాఠాలు అప్‌లోడ్‌ చేయనున్నారు. స్వచ్ఛంద సంస్థ స్ఫూర్తి ఫౌండేషన్‌.. ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ సంస్థ కాగ్నిజెంట్‌ సహకారంతో ఈ వెబ్‌సైట్‌ను రూపొందించారు. ఇందులో ప్రత్యేకంగా స్టూడెంట్‌, టీచర్‌, అడ్మిన్‌ లాగిన్‌ ఉంటాయి. విద్యార్థులు స్టూడెంట్‌ లాగిన్‌లోకి వెళ్లి తరగతిని ఎంచుకుని పాఠాలు(తెలుగు/ఇంగ్లిష్‌) వినవచ్చు.