• facebook
  • whatsapp
  • telegram

సీఏ పరీక్షలు వాయిదా

ఈనాడు, హైదరాబాద్‌: ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఛార్టెర్డ్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా (ఐసీఏఐ) సీఏ పరీక్షలను మరోసారి వాయిదా వేసింది. కరోనా తీవ్రత నేపథ్యంలో వాటిని నవంబరులో నిర్వహిస్తామని తెలిపింది. ప్రస్తుత విద్యాసంవత్సరంలో మే, నవంబరు నెలల్లో రెండుసార్లు పరీక్షలు జరగాల్సి ఉంది, మే నెలలో జరగాల్సిన పరీక్షలను కరోనా కారణంగా జులై 29 నుంచి నిర్వహిస్తామని గతంలో ప్రకటించారు. జులై పరీక్షలకు హాజరు కాలేమని భావించే విద్యార్థులు వచ్చే నవంబరులో జరిగే రాసుకునేలా వెసులుబాటు కల్పిస్తూ జూన్‌ 17న ఐసీఏఐ వెల్లడించింది. ఐసీఏఐ తాజా నిర్ణయంతో మే విడత పరీక్షలు రద్దయినట్టయింది.