• facebook
  • whatsapp
  • telegram

సీబీఎస్‌ఈ బాటలోనే..

* సైన్స్‌ పాఠ్యాంశాల తగ్గింపుపై ఇంటర్‌బోర్డు నిర్ణయం
* ఆర్ట్స్‌ సబ్జెక్టులపై త్వరలో కమిటీలు


ఈనాడు, హైదరాబాద్‌: కరోనా కారణంగా కళాశాలల పనిదినాలు తగ్గిపోతుండటంతో 11, 12 తరగతుల్లో కొన్ని పాఠ్యాంశాలను తొలగిస్తూ సీబీఎస్‌ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోనూ ఇంటర్‌ ఎంపీసీ, బైపీసీల్లో ఆయా పాఠ్యాంశాలను తొలగించాలని ఇంటర్‌బోర్డు నిర్ణయించింది. జేఈఈ, నీట్‌ పరీక్షల కోసం సీబీఎస్‌ఈ సిలబస్‌నే తెలంగాణ ఇంటర్‌బోర్డు అనుసరించింది. ఆ ప్రకారం ఇంటర్‌ గణితం, భౌతిక, రసాయన, జీవ, జంతుశాస్త్రాల సిలబస్‌ సీబీఎస్‌ఈలో, రాష్ట్రంలో దాదాపు ఒకటే. తొలగించిన పాఠ్యాంశాల నుంచి వచ్చే ఏడాది జరిగే జేఈఈ, నీట్‌ పరీక్షల్లో ప్రశ్నలు ఇవ్వొద్దని జాతీయ పరీక్షల మండలి(ఎన్‌టీఏ)కి ఇప్పటికే సీబీఎస్‌ఈ లేఖ రాసినట్లు తెలిసింది. రాష్ట్రంలో ఇంటర్‌ ఆర్ట్స్‌ గ్రూపుల్లో ఏ పాఠ్యాంశాలను తొలగించాలనే అంశంపై సబ్జెక్టు నిపుణులతో కమిటీలను ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకోనున్నారు. ఆర్ట్స్‌ గ్రూపుల్లో సీబీఎస్‌ఈ, రాష్ట్ర సిలబస్‌ మధ్య చాలా వ్యత్యాసం ఉందని చెబుతున్నారు.