• facebook
  • whatsapp
  • telegram

జులై 13న‌ ఎంసెట్‌ నిర్వహణపై తుది నిర్ణయం

ఈనాడు, అమరావతి: ఏపీ ఎంసెట్‌తో సహా అన్ని ఉమ్మడి ప్రవేశ పరీక్షలను నిర్వహించడంపై జులై 13న‌ స్పష్టత వచ్చే అవకాశముంది. కన్వీనర్లతో జులై 11న‌ మంత్రి సురేష్‌, ఉన్నత విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్‌చంద్ర, ఉన్నత విద్యా మండలి ఛైర్మన్‌ హేమచంద్రారెడ్డి ఆన్‌లైన్‌ సమీక్ష నిర్వహించారు. పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేసుకోవాలని కన్వీనర్లకు ఈ సందర్భంగా మంత్రి సూచించారు. కరోనా లక్షణాలు ఉన్నట్లు విద్యార్థులు సమాచారమిస్తే వారికి ప్రత్యేక గదులను ఏర్పాటు చేయాలని, లaక్షణాలున్న వారికి మరోమారు పరీక్ష నిర్వహించడంపైనా సమీక్షలో చర్చకు వచ్చినట్లు తెలిసింది.