• facebook
  • whatsapp
  • telegram

భారత్‌లో హౌస్‌ సర్జన్‌కు చివరి అవకాశం

* చైనాలో ఎంబీబీఎస్‌ చేసినవారికి కేంద్రం స్పష్టీకరణ
ఈనాడు, అమరావతి: చైనాలోని వైద్య విశ్వవిద్యాలయాల్లో ఎంబీబీఎస్‌ చదివే విద్యార్థులు భారతదేశంలో ‘హౌస్‌ సర్జన్‌’ చేయడానికి కేంద్రం అనుమతినిచ్చింది. ఆరేళ్ల ఎంబీబీఎస్‌ కోర్సును పూర్తిచేసిన వారికి మాత్రమే ‘ఎఫ్‌ఎంజీఈ’ రాసే అవకాశాన్ని కల్పిస్తామని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ముందస్తు ప్రకటన చేయకుండా అర్ధాంతరంగా కేంద్రం ఈ నిర్ణయాన్ని ప్రకటించడం పట్ల వైద్య విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై వెళ్లిన విజ్ఞప్తులను అనుసరించి కేంద్రం సూచించిన మేరకు నేషనల్‌ బోర్డు ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ నిబంధనలు సడలించింది. భారతదేశంలో హౌస్‌ సర్జన్‌ చేయడానికి చివరి అవకాశం ఇస్తున్నట్లు పేర్కొంది.