• facebook
  • whatsapp
  • telegram

ప్రాథమిక విద్యార్థులకు సప్తగిరి ఛానల్‌లో యంగ్‌మైండ్స్‌

ఈనాడు, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 1 నుంచి 5వ తరగతుల విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంచేందుకు దూరదర్శన్‌ సప్తగిరి ఛానల్‌లో వారానికోరోజు యంగ్‌మైండ్స్‌ పేరుతో కార్యక్రమాన్ని ప్రసారం చేయనున్నారు. ఇందులో పిల్లలకు కథలు, పాటలు, కాగితాలతో బొమ్మలు రూపొందించడం తదితర అంశాలను బోధిస్తారు. సృజనాత్మకతతో కూడిన మ్యాజిక్‌ నేర్పిస్తారు. ఇందుకు సంబంధించిన ప్రణాళికను పాఠశాల విద్యశాఖ రూపొందించింది.