• facebook
  • whatsapp
  • telegram

సెప్టెంబరు 8 నుంచి భాష పరీక్షలు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: అఖిల భారత, రాష్ట్ర సర్వీసుల్లో పనిచేసే అధికారులకు సెప్టెంబరు 8 నుంచి 11 తేదీల మధ్య భాష(లాంగ్వేజ్‌) పరీక్షలు నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ ప్రకటించింది.  అభ్యర్థుల నుంచి ఆగస్టు 10 వరకూ దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపింది. దరఖాస్తు, ఇతర వివరాలు ఏపీపీఎస్సీ వెబ్‌సైట్‌లో ఉంటాయని వివరించింది.