• facebook
  • whatsapp
  • telegram

బీసీ గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తు గడువు పెంపు

ఈనాడు, హైదరాబాద్‌: బీసీ గురుకుల జూనియర్‌ కళాశాలలు, మహిళా డిగ్రీ కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తు గడువు పొడిగించినట్లు బీసీ గురుకులాల సొసైటీ కార్యదర్శి మల్లయ్య బట్టు తెలిపారు. అర్హులైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ విద్యార్థులు జులై 19లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
లాసెట్‌ దరఖాస్తుకు గడువు పొడిగింపు
లాసెట్‌, పీజీఎల్‌సెట్‌కు రూ.4 వేల ఆలస్య రుసుంతో దరఖాస్తుకు గడువును ఈ నెల 25 వరకు పొడిగించినట్లు కన్వీనర్‌ ఆచార్య జీబీ రెడ్డి పేర్కొన్నారు.