• facebook
  • whatsapp
  • telegram

పాలిసెట్‌ ర్యాంకులతో వ్యవసాయ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు

ఈనాడు, హైదరాబాద్‌: పాలిసెట్‌-2020 ప్రవేశపరీక్ష ర్యాంకుల ఆధారంగానే వ్యవసాయ డిప్లొమా కోర్సుల్లో సీట్లు భర్తీ చేస్తామని ఆచార్య జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌ సుధీర్‌కుమార్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. పాలిసెట్‌ రాయడానికి ఈ నెల 25లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆన్‌లైన్‌ దరఖాస్తు, ఇతర వివరాలకు ‘పాలిసెట్‌.ఎన్‌ఐసీ.ఇన్‌’ వెబ్‌సైట్‌లో చూడవచ్చు. వచ్చే నెలలో ఈ పరీక్ష నిర్వహించాలని రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణ మండలి నిర్ణయించిందని సుధీర్‌కుమార్‌ తెలిపారు. ర్యాంకులు వెల్లడైన తరువాత డిప్లొమా కోర్సులకు ప్రవేశప్రకటన ఇస్తామన్నారు.