• facebook
  • whatsapp
  • telegram

సీబీఎస్‌ఈ పదో తరగతి పరీక్షల ఫలితాల విడుదల

దిల్లీ: సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) పదో తరగతి పరీక్షల ఫలితాలు బుధవారం వెలువడ్డాయి. ఈ ఏడాది మొత్తం 18.73 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవగా, వారిలో 17.13 లక్షల (91.46%) మంది ఉత్తీర్ణత సాధించారు. గతేడాదితో పోల్చితే ఉత్తీర్ణత శాతం 0.36 మేర పెరిగింది. బాలికలు ఫలితాల్లో మరోమారు అబ్బాయిలను వెనక్కు నెట్టారు. 90 శాతం, 95 శాతానికి మించి మార్కులు సాధించిన విద్యార్థుల సంఖ్యలో ఈ ఏడాది తగ్గుదల నమోదైంది.గతేడాది 57 వేలమందికిపైగా విద్యార్థులు 95 శాతం మార్కులు సాధించగా ఈ ఏడాది 41,084 మంది మాత్రమే పొందగలిగారు.