• facebook
  • whatsapp
  • telegram

జేఈఈ మెయిన్‌ అభ్యర్థులకు ఎన్టీఏ సూచన

* ఎన్డీఏ, ఎన్‌ఏ పరీక్షలకు హాజరయ్యేవారు వివరాలు వెల్లడించండి
ఈనాడు, హైదరాబాద్‌: జేఈఈ మెయిన్‌ రాయబోయే విద్యార్థులు సెప్టెంబరు 6న నిర్వహించే నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ(ఎన్డీఏ), నావల్‌ అకాడమీ(ఎన్‌ఏ) పరీక్షలకు హాజరు కానున్నట్లయితే ఆ విషయాన్ని చెప్పాలని జాతీయ పరీక్షల మండలి(ఎన్టీఏ) సూచించింది. ఆ విద్యార్థులకు ఒకే రోజు పరీక్షలు రాసే ఇబ్బంది లేకుండా చూస్తామని తెలిపింది. పరీక్షలు రాసే నగరాలను మార్చుకోవడానికి, దరఖాస్తు ఫారాల్లో పేర్కొన్న వివరాల్లో తప్పులను సవరించేందుకు జులై 15వ తేదీ వరకు గడువు ఉండగా తాజాగా దాన్ని 20వ తేదీ వరకు పొడిగించినట్లు పేర్కొంది. ఎన్డీఏ, ఎన్‌ఏ పరీక్షలకు హాజరవుతున్నట్లు పేర్కొంటే ఆ రోజు కాకుండా ఇతర రోజుల్లో జేఈఈ మెయిన్‌ రాసేలా తేదీలను ఖరారు చేస్తామని ఎన్టీఏ తెలిపింది. విద్యార్థులు ఏదో ఒక పరీక్షను వదులుకోవాల్సిన ఇబ్బంది తప్పుతుందని పేర్కొంది. దేశవ్యాప్తంగా జేఈఈ మెయిన్‌ ఆన్‌లైన్‌ పరీక్షలను సెప్టెంబరు 1 నుంచి 6వ తేదీ వరకు నిర్వహించనున్నారు.