• facebook
  • whatsapp
  • telegram

బీసీ సంక్షేమ గురుకులాల్లో ప్రవేశానికి స్క్రీనింగ్‌ పరీక్ష రద్దు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా బీసీ సంక్షేమ గురుకులాల్లో విద్యార్థుల ప్రవేశానికి చేపట్టే స్క్రీనింగ్‌ పరీక్షను ప్రభుత్వం రద్దు చేసింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో 5వ తరగతిలో ప్రవేశం, 6, 7, 8, 9 తరగతుల్లో ఖాళీల భర్తీకి ఈ ఏడాది స్క్రీనింగ్‌ పరీక్ష నిర్వహించడాన్ని ఉపసంహరిస్తూ ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి ప్రవీణ్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. పాఠశాలలు ప్రారంభమయ్యాక ఆయా తరగతుల్లో లాటరీ విధానం ద్వారా ప్రవేశాలు కల్పించాలని ఆదేశాలిచ్చారు.