• facebook
  • whatsapp
  • telegram

వీడియో పాఠాలు రూపొందించండి

*  అధ్యాపకులకు ఆదేశాలు
ఈనాడు, హైదరాబాద్‌: కొత్త విద్యా సంవత్సరం(2020-21) ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో బోధన కోసం శాశ్వత అధ్యాపకులు ప్రతి ఒక్కరూ వీడియో పాఠాలు రూపొందించి యూట్యూబ్‌లో ఉంచాలని కళాశాల విద్యాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు కళాశాల విద్యాశాఖ కమిషనర్‌ నవీన్‌ మిత్తల్‌ జులై 15న ఉత్తర్వులు జారీ చేశారు. 31 వరకు ఇంటి వద్దే ఉండి పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్లతో కూడిన వీడియో పాఠాలు తయారు చేయాలని ఉత్తర్వుల్లో పేరొన్నారు. ఒక్కో అంశంపై ప్రతిరోజూ 45-50 నిమిషాల నిడివితో పాఠాలను రూపొందించి యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేయాలని సూచించారు. అధ్యాపక శిక్షణలో ఉన్న వారికి పాఠాల తయారీ నుంచి మినహాయింపు ఉంటుంది. వీటి తయారీపై అధ్యాపకులకు శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల అధ్యాపకుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేందర్‌రెడ్డి కమిషనర్‌ను కోరారు.