• facebook
  • whatsapp
  • telegram

17న‌ పరీక్షలు, సెట్‌లపై సమావేశం

ఈనాడు, హైదరాబాద్‌: ప్రవేశ పరీక్షలతోపాటు డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్‌ తదితర కోర్సుల చివరి సెమిస్టర్‌ పరీక్షల నిర్వహణకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ పచ్చజెండా ఊపడంతో విద్యాశాఖ జులై 17న‌ దీనిపై సమావేశం నిర్వహిస్తోంది. విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్‌ వద్ద జరిగే ఈ సమావేశానికి ఉన్నత విద్యామండలి అధికారులు హాజరుకానున్నారు. పరీక్షల తేదీలు, హైకోర్టుకు సమర్పించాల్సిన అఫిడవిట్‌పై చర్చించనున్నారు. ప్రవేశ పరీక్షలను టీసీఎస్‌ అయాన్‌ సంస్థ నిర్వహిస్తోంది. ఆగస్టు నెలలో 4 నుంచి 14వ తేదీ వరకు, 24 నుంచి 28వ తేదీ వరకు  ఆన్‌లైన్‌ పరీక్షలు నిర్వహించుకునేందుకు స్లాట్లు ఖాళీగా ఉన్నాయి. హైకోర్టులో కేసు విచారణలో ఉన్నందున దీనిపై న్యాయస్థానం అనుమతి కూడా తీసుకోవాల్సి ఉంది.