• facebook
  • whatsapp
  • telegram

సచివాలయాల పరీక్ష వాయిదా

ఈనాడు డిజిటల్‌, అమరావతి: కరోనా నేపథ్యంలో ఆగస్టు 2వ వారంలో నిర్వహించాల్సిన గ్రామ, వార్డు సచివాలయాల పరీక్ష వాయిదా వేస్తున్నట్లు పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. నిర్వహణ షెడ్యూల్‌ను తర్వాత ప్రకటిస్తామన్నారు.