• facebook
  • whatsapp
  • telegram

టీశాట్‌ ఛానళ్లలో టీఎస్‌ఆర్‌జేసీ సెట్‌పై ప్రసారాలు

* జులై 20 నుంచి ప్రారంభం
ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర గురుకుల జూనియర్‌ కళాశాల (టీఎస్‌ఆర్‌జేసీ) ప్రవేశ పరీక్షలో అర్హత సాధించేందుకు విద్యార్థ్ధుల కోసం ప్రత్యేక అవగాహన పాఠ్యాంశాలను జులై 20(సోమవారం) నుంచి టీశాట్‌ నెట్‌వర్క్‌ ఛానళ్లలో ప్రసారం చేయనున్నట్లు ఆ సంస్థ సీఈవో శైలేష్‌రెడ్డి తెలిపారు. నిపుణ, విద్యా ఛానళ్ళలో ఉదయం, సాయంత్రం వేళల్లో రెండు గంటల పాటు సంబంధిత ప్రసారాలు 25 రోజులు ఉంటాయని తెలిపారు. ఆగస్టులో టీఎస్‌ఆర్‌జేసీ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థ్ధుల కోసం ప్రత్యేక ప్రసారాలు అందిస్తున్నామని ఆయన వివరించారు.‍‍