• facebook
  • whatsapp
  • telegram

భాషా పండిత అభ్యర్థులకు కౌన్సెలింగ్‌

గుడ్లవల్లేరు, న్యూస్‌టుడే: రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యా శిక్షణ సంస్థల్లో (డైట్‌ కళాశాలలు) భాషోపాధ్యాయ అభ్యర్థుల ప్రవేశాలకు సోమవారం కౌన్సెలింగ్‌ ప్రక్రియ చేపట్టారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో మార్చి 22 నుంచి దేశవ్యాప్త లాక్‌డౌన్‌ విధించడంతో విద్యా సంబంధిత కార్యక్రమాలను ప్రభుత్వాలు నిలిపేశాయి. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో తొలిసారి భాషోపాధ్యాయుల ప్రవేశాలకు నేరుగా కౌన్సెలింగ్‌ చేపట్టారు. తెలుగు, హిందీ పండిట్ల సీట్ల భర్తీ ప్రక్రియ సోమవారంనుంచి ప్రారంభమైంది. డిగ్రీ పూర్తయిన అభ్యర్థులు జూన్‌ 26న ఆన్‌లైన్‌లో రాసిన భాష పండితుల పరీక్ష ఫలితాలు వెలువడ్డాయి. షెడ్యూల్‌ ప్రకారం కౌన్సెలింగ్‌ను ప్రారంభించారు. వ్యక్తిగత దూరం పాటిస్తూ ధ్రువపత్రాలను పరిశీలించి ప్రవేశ పత్రాలనిచ్చామని కృష్ణా డైట్‌ ప్రిన్సిపల్‌ వినయ్‌కుమార్‌ తెలిపారు.