• facebook
  • whatsapp
  • telegram

21, 22 తేదీల్లో పీజీ మెడికల్‌ తుది విడత కౌన్సెలింగ్‌

* కాళోజీ హెల్త్‌ యూనివర్సిటీ నోటిఫికేషన్‌ జారీ

ఈనాడు, హైదరాబాద్‌: పీజీ మెడికల్‌, డెంటల్‌ కోర్సుల్లో ప్రవేశాలకు జులై 21, 22 తేదీల్లో తుది విడత వెబ్‌కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు. ఈ మేరకు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం సోమవారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. యూనివర్సిటీ పరిధిలోని యాజమాన్య కోటా సీట్లను ఈ నోటిఫికేషన్‌ ద్వారా భర్తీచేయనున్నారు. 21వ తేదీ నుంచి 22 వరకూ ప్రాధాన్యక్రమంలో కళాశాలలవారీగా వెబ్‌ఆప్షన్లు నమోదు చేసుకోవాలని వర్సిటీ సూచించింది. నీట్‌ అర్హత కటాఫ్‌ స్కోరు తగ్గించిన నేపథ్యంలో ‘రివైజ్డ్‌- తుది మెరిట్‌ జాబితా’లోని అర్హులైన అభ్యర్థులు ఈ విడత వెబ్‌కౌన్సెలింగ్‌లో పాల్గొనాలని పేర్కొంది. గత ఏడాది కౌన్సెలింగ్‌లో సీటు పొంది చేరని వారు, అలాగే కళాశాలలో చేరి మధ్యలో మానేసిన విద్యార్థులు కూడా ఇందులో పాల్గొనవచ్చు. ఆల్‌ ఇండియా కోటా కౌన్సెలింగ్‌ కింద ఇప్పటికే చేరిన వారిని అనర్హులుగా గుర్తిస్తారు. ఇతర వివరాలకు కళాశాల వెబ్‌సైట్‌ ‌www.knruhs.telangana.gov.in లో సంప్రదించాలని యూనివర్సిటీ వర్గాలు సూచించాయి.