• facebook
  • whatsapp
  • telegram

ఇంటర్‌లో ఆన్‌లైన్‌ ప్రవేశాలు చేపట్టండి

ఈనాడు, హైదరాబాద్‌: కరోనా కారణంగా 2020-21 విద్యాసంవత్సరంలో ఇంటర్‌ ప్రవేశాలను ఆన్‌లైన్‌లో చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ కళాశాలల కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం సోమవారం ఇంటర్‌ విద్యాశాఖ కమిషనర్‌ జలీల్‌కు విన్నవించింది. పెద్దగా ఉన్న తరగతి గదులను రెండుగా విభజించి వాడుకోవాలని, 25% ఆన్‌లైన్‌, 75% తరగతి గది బోధన కొనసాగించాలని, విద్యాబోధన తీరును తెలియజేయడానికి యాప్‌ను రూపొందించాలని సూచించింది. సెలవులను తగ్గించాలని, కంటెయిన్‌మెంట్‌ జోన్లలోని విద్యార్థులు, అధ్యాపకులకు హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరింది.