• facebook
  • whatsapp
  • telegram

పోస్టులకు ఎంపికైన వారికి నియామకపు ఉత్తర్వులివ్వాలి

గాంధీభవన్‌, న్యూస్‌టుడే: టీఆర్టీ నోటిఫికేషన్‌-2017 ద్వారా వికలాంగుల కోటాలో స్కూల్‌ అసిస్టెంట్‌, ఎల్‌పీ హిందీ, గ్రేడ్‌-1 హిందీ పోస్టులకు ఎంపికైన వారికి వెంటనే నియామకపు ఉత్తర్వులు అందజేయాలని టీపీఆర్టీయూ వ్యవస్థాపక అధ్యక్షుడు జి.హర్షవర్ధన్‌రెడ్డి ఒక ప్రకటనలో సీఎం కేసీఆర్‌ను కోరారు. ఎస్‌ఎస్‌ఏ కింద పని చేస్తున్న పార్ట్‌టైం ఇన్‌స్పెక్టర్స్‌ ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని పేర్కొన్నారు.