• facebook
  • whatsapp
  • telegram

నిట్‌ బీటెక్‌ ‘ఆఖరి పరీక్షలు’ ఆన్‌లైన్‌లో

నిట్‌క్యాంపస్‌, న్యూస్‌టుడే: వరంగల్‌ ఎన్‌ఐటీ(నిట్‌)లో ఇంజినీరింగ్‌ ఆఖరి సంవత్సరం చదువుతున్నవిద్యార్థులకు జులై చివరి వారంలో ఆన్‌లైన్‌ పరీక్షలు నిర్వహించనున్నారు. ఎంహెచ్‌ఆర్డీ ఆదేశాల మేరకు పరీక్షలను నిర్వహించనున్నట్లు నిట్‌ డైరెక్టర్‌ ఆచార్య ఎన్‌.వి.రమణారావు బుధవారం ‘న్యూస్‌టుడే’కు తెలిపారు.