• facebook
  • whatsapp
  • telegram

ఆ 257 మంది డీటీలను విధుల్లోకి తీసుకోండి

* కలెక్టర్లకు సీఎస్‌ ఆదేశం
 

ఈనాడు, హైదరాబాద్‌: గ్రూప్‌-2లో ఎంపికైన డిప్యూటీ తహసీల్దార్లకు (ప్రొబెషనరీ డిప్యూటీ తహసీల్దార్లు/డీటీలు) పోస్టింగ్‌లపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 259 మంది ఎంపిక కాగా జాయినింగ్‌ ఆర్డర్లు మాత్రం 257 మాత్రమే సమర్పించారు. వీరిని రెండు రోజుల్లో విధుల్లోకి తీసుకోవాలంటూ ఉమ్మడి జిల్లాల కలెక్టర్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ఆదేశించారు.
ఫిబ్రవరిలోనే శిక్షణ పూర్తి
2016లో ఎంపికైన వీరికి గతేడాది నవంబరులో ప్రభుత్వం అపాయింటుమెంట్లు కల్పించింది. పోస్టింగ్‌ల కోసం వీరంతా ఎదురుచూస్తున్నారు. కొందరైతే ఉపాధి కూలీలుగా మారారు. వారి దీన స్థితిని  గత నెల 11వ తేదీన ‘కాబోయే అధికారి... కూలీగా మారి’’ శీర్షికన ‘ఈనాడు’ ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  త్వరితగతిన పోస్టింగ్‌లు కల్పించేందుకు చర్యలు చేపట్టారు.