• facebook
  • whatsapp
  • telegram

పాలిసెట్‌ దరఖాస్తు గడువు పొడిగింపు

ఈనాడు, అమరావతి: పాలిటెక్నిక్‌ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించే పాలిసెట్‌ దరఖాస్తుల గడువు జులై 27వరకు పొడిగించారు. సాధారణంగా 1.25 లక్షల వరకు వచ్చే దరఖాస్తులు ఈసారి 70వేలు పైచిలుకు మాత్రమే వచ్చాయి. కరోనా ఉద్ధృతి కారణంగా ప్రస్తుతం ప్రవేశ పరీక్ష నిర్వహించే అవకాశం లేనందున విద్యార్థులకు మరికొంత సమయం ఇచ్చే అవకాశం ఉంది.