• facebook
  • whatsapp
  • telegram

3,500 పాఠశాలల్లో ఎల్‌కేజీ, యూకేజీ

ఈనాడు, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది 3,500 ప్రాథమిక పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక విద్య(ఎల్‌కేజీ, యూకేజీ)ను ప్రవేశపెట్టనున్నారు. ఇందుకు అవసరమయ్యే పాఠ్యాంశాల రూపకల్పనతో పాటు ఉపాధ్యాయుల నియామకానికి పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల ఆవరణలో ఉన్న అంగన్‌వాడీ పిల్లల్ని ఈ బడుల్లోకి తీసుకొని ఒకటో తరగతికి సంసిద్ధులను చేసేందుకు పూర్వ ప్రాథమిక విద్య బోధిస్తారు. ప్రస్తుతం జిల్లా ఉపాధ్యాయ విద్య శిక్షణ సంస్థ(డైట్‌)ల్లో పూర్వ ప్రాథమిక విద్యకు ప్రత్యేక కోర్సులు లేవు. ప్రత్యేకంగా ఎల్‌కేజీ, యూకేజీ స్థాయిలో బోధనకు ప్రత్యేక శిక్షణ తీసుకురానున్నారు.