• facebook
  • whatsapp
  • telegram

గైర్హాజరైన విద్యార్థులు  ఏడాది నిరీక్షించాల్సిందే

ఈనాడు, అమరావతి: కరోనా కారణంగా ఇంటర్మీడియట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలను రద్దు చేయడంతో దాదాపు 40 వేల మంది విద్యార్థులు ఏడాది సమయాన్ని కోల్పోనున్నారు. మార్చిలో నిర్వహించిన పరీక్షలకు వివిధ కారణాలతో కొందరు విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఇలాంటివారు అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ రాసుకోవచ్చనే ఆలోచనతో ఉండగా.. ఇంటర్‌ విద్యామండలి వాటిని రద్దు చేసింది. మార్చిలో పరీక్షలకు హాజరై ఉత్తీర్ణత మార్కులు సాధించలేకపోయినా.. వారిని ఉత్తీర్ణులుగా ప్రకటించింది. కానీ పరీక్షకు గైర్హాజరైన వారిని అనుత్తీర్ణులుగా పేర్కొంది. దీంతో ఏదైనా కారణంతో ఒక్క పరీక్ష రాయకపోయినా ఏడాది నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తమకు పరీక్ష నిర్వహించాలని, ఏడాది సమయం కోల్పోతున్నామని పలువురు విద్యార్థులు అధికారులకు విన్నవిస్తున్నారు. అయితే, ఈ విషయంలో చేయగలిగింది ఏమీ లేదని అధికారులు సమాధానమిస్తున్నారు.