• facebook
  • whatsapp
  • telegram

పీజీ డెంటల్‌లో కన్వీనర్‌ కోటా సీట్ల భర్తీకి నోటిఫికేషన్‌

ఎంజీఎం ఆసుపత్రి, న్యూస్‌టుడే: వైద్య కళాశాలలో పీజీ డెంటల్‌ కోర్సుల్లో కన్వీనర్‌ కోటాలో ప్రవేశాలకు(మాపప్‌) జులై 23న‌ కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. జులై 24, 25 తేదీల్లో వెబ్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. కన్వీనర్‌ కోటాలో మిగిలిపోయిన సీట్లను ఈ మాపప్‌ నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ చేయనున్నారు. జులై  24న మధ్యాహ్నం 1 గంట నుంచి 25 వతేదీ సాయంత్రం 4 గంటల వరకు ప్రాధాన్య క్రమంలో కళాశాలల వారీగా వెబ్‌ ఆప్షన్లను నమోదు చేసుకోవాలని వారు సూచించారు. యూనివర్సిటీ ఇప్పటికే విడుదల చేసిన అర్హులైన అభ్యర్థులు ఈవిడత వెబ్‌ కౌన్సెలింగ్‌లో పాల్గొనాలని పేర్కొన్నారు. గత విడత కౌన్సెలింగ్‌లో సీటు పొంది చేరని అభ్యర్థులు, అదే విధంగా కళాశాలలో చేరి మధ్యలో మానేసిన అభ్యర్థులు ఈ వెబ్‌ కౌన్సెలింగ్‌కు అనర్హులని ప్రకటించారు. అఖిలభారత కోటా కౌన్సెలింగ్‌ కింద ఇప్పటికే చేరిన అభ్యర్థులను కూడా ఈ వెబ్‌ కౌన్సెలింగ్‌కు అనర్హులుగా పరిగణిస్తారని తెలిపారు. ఇతర వివరాలకు ‌www.knruhs.telangana.gov.in  వెబ్‌సైట్‌లో సంప్రదించాలని యూనివర్సిటీ అధికారులు సూచించారు.