• facebook
  • whatsapp
  • telegram

లవ్లీ వర్సిటీ విద్యార్థికి రూ.1.3 కోట్ల ఉపకార వేతనం

దిల్లీ: జలంధర్‌లోని లవ్లీ ప్రొఫెషనల్‌ యూనివర్సిటీకి చెందిన అగ్రి జెనెటిక్స్‌ పీజీ విద్యార్థి సుమంత్‌ బిందాల్‌ రూ.1.3 కోట్ల ఉపకార వేతనం సాధించాడు. ఆస్ట్రేలియన్‌ నేషనల్‌ యూనివర్సిటీలో ‘ప్లాంట్‌ సైన్సెస్‌’లో పీహెచ్‌డీ చేసేందుకు అతనికీ ఉపకార వేతనం దక్కింది. దేశంలో వ్యవసాయ శాస్త్రం చదివే విద్యార్థుల్లో ఇంత భారీ ఉపకారవేతనం పొందిన విద్యార్థి సుమంతేనని లవ్లీ వర్సిటీ ఓ ప్రకటనలో పేర్కొంది. సుమంత్‌ ప్రస్తుతం టమోటలో ఫంగస్‌ నిరోధక జన్యువులపై పరిశోధన చేస్తున్నాడు.