• facebook
  • whatsapp
  • telegram

సార్వత్రిక’ విద్యార్థులంతా ఉత్తీర్ణులే

* పది, ఇంటర్‌ విద్యార్థులకు ఊరట
 

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ సార్వత్రిక విద్యాపీఠం(టాస్‌) కింద పది, ఇంటర్‌ పరీక్షలు రాసేందుకు పేర్లు నమోదు చేసుకున్న విద్యార్థులందరినీ పరీక్షలు లేకుండానే ఉత్తీర్ణులను చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు విద్యాశాఖ జులై 24న‌ ఉత్తర్వులు జారీ చేసింది. వాస్తవానికి వారు ఏప్రిల్‌/మే నెలల్లో జరిగే పరీక్షలు రాయాల్సి ఉండగా కరోనా కారణంగా వాటిని నిర్వహించడం సాధ్యం కాదని భావించిన ప్రభుత్వం ఇలా ముందుకు వెళ్లింది. దీనివల్ల పదో తరగతిలో 43 వేల మంది, ఇంటర్‌లో 32 వేల మంది...మొత్తం 75 వేల మంది ప్రయోజనం పొందుతారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.