• facebook
  • whatsapp
  • telegram

పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలు ప్రారంభం

ఈనాడు డిజిటల్‌, అమరావతి: పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలు ప్రారంభమయ్యాయి. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు మొదటి రోజు క్షేత్ర స్థాయిలో పర్యటించి తల్లిదండ్రులను కలిసి పిల్లలను పాఠశాలల్లో చేర్పించుకున్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో ఉన్న 5 ఏళ్లు నిండిన చిన్నారులను ప్రాథమిక పాఠశాలల్లో, 5వ తరగతి పూర్తయిన వారిని ఉన్నత పాఠశాలల్లో చేర్పించుకున్నారు. కర్నూలు జిల్లా రామాపురంలోని పాఠశాలలో ఉన్న 45 మంది 5వ తరగతి విద్యార్థుల్లో 38 మంది 6వ తరగతిలో, మరో ఐదుగురు ఆదర్శ పాఠశాలకు, ఇద్దరు వసతి గృహానికి వెళ్లేందుకు సమ్మతించినట్లు ఉపాధ్యాయులు తెలిపారు. వలస కార్మికుల పిల్లలను పాఠశాలల్లో చేర్పించేందుకు ఉపాధ్యాయులు చర్యలు తీసుకుంటున్నారు.