• facebook
  • whatsapp
  • telegram

వైద్య విద్యలో ఓబీసీ రిజర్వేషన్లపై కమిటీ వేయండి

చెన్నై, న్యూస్‌టుడే: వైద్య విద్యలో జాతీయ కోటా కింద ఓబీసీ విద్యార్థులకు 50 శాతం రిజర్వేషన్లు కోరుతూ మద్రాసు హైకోర్టులో దాఖలైన పిటిషన్లను  జులై 27న‌ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఏపీ సాహి నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. కేంద్రం నిర్వహణలో లేని విద్యా సంస్థల్లో ఆల్‌ ఇండియా కోటా కింద ఓబీసీ విద్యార్థులకు 50 శాతం రిజర్వేషన్ల పరిశీలనకు కేంద్ర ఆరోగ్యం, కుటుంబ సంక్షేమశాఖ, తమిళనాడు ఆరోగ్యశాఖ, అఖిలభారత వైద్య మండలితో కమిటీ ఏర్పాటు చేయాలని కేంద్రానికి సూచించింది. 3 నెలల్లో కమిటీని నియమించాలని పేర్కొంది. రిజర్వేషన్‌ కల్పించడానికి చట్టరీత్యా, రాజ్యాంగపరంగా ఎలాంటి అవరోధమూ లేదని వెల్లడించింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచే అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని పేర్కొంది.