• facebook
  • whatsapp
  • telegram

31 నుంచి వెబ్‌సైట్‌లో ఇంటర్‌ షార్ట్‌ మెమోలు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం జనరల్‌ షార్ట్‌ మెమోలు జులై 31 నుంచి ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయని బోర్డు కార్యదర్శి వి రామకృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. ఆగస్టు 1 నుంచి ద్వితీయ సంవత్సరం వొకేషనల్‌, మొదటి సంవత్సరం జనరల్‌, వొకేషనల్‌ షార్ట్‌ మెమోలను అందుబాటులో ఉంచుతామన్నారు. వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని వివరించారు.