• facebook
  • whatsapp
  • telegram

వైద్య విద్యలో పీజీ సీట్ల భర్తీకి గడువు పొడిగింపు

ఈనాడు, దిల్లీ: 2020-21 విద్యాసంవత్సరంలో వైద్య విద్య పీజీ సీట్ల భర్తీకి ఆగస్టు 31 వరకు గడువును పొడిగిస్తూ సుప్రీంకోర్టు జులై 30న‌ ఆదేశాలు ఇచ్చింది. కరోనా నేపథ్యంలో కనీస అర్హత మార్కులు తగ్గించాలని, గడువును పొడిగించాలని తెలంగాణ ప్రైవేటు మెడికల్‌, డెంటల్‌ కళాశాలల యాజమాన్యాలు దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్‌ రోహింటన్‌ ఫాలీ నారీమన్‌, జస్టిస్‌ నవీన్‌ సిన్హా, జస్టిస్‌ ఇందిరా బెనర్జీలతో కూడిన ధర్మాసనం గురువారం విచారించింది. పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాది కె.వి.విశ్వనాథన్‌, రమేశ్‌ అల్లంకిలు వాదనలు వినిపించారు. కనీస అర్హత నిబంధనల సడలింపు కోసం భారత వైద్య మండలి (ఎంసీఐ), నేషనల్‌ ఎగ్జామినేషన్‌ బోర్డు (ఎన్‌ఈబీ)కు విజ్ఞప్తి చేసుకోవాలని సూచించింది. ఈ ఆదేశాలు అన్ని రాష్ట్రాలకు వర్తిస్తాయని ఎంసీఐ స్పష్టం చేసింది.