• facebook
  • whatsapp
  • telegram

వెబ్‌సైట్‌లో సవరించిన ఇంటర్‌ మార్కుల మెమోలు

ఈనాడు, హైదరాబాద్‌: గత మార్చి పరీక్షల్లో ఇంటర్‌ రెండో సంవత్సరంలో తప్పిన విద్యార్థులకు కనీస మార్కులు ఇచ్చి కంపార్ట్‌మెంటల్‌లో పాస్‌ చేసినందున, వారి సవరించిన మార్కుల మెమోలను జులై 31న‌ మధ్యాహ్నం 2 నుంచి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతామని ఇంటర్‌బోర్డు కార్యదర్శి సయ్యద్‌ ఉమర్‌ జలీల్‌ తెలిపారు. విద్యార్థులు www.tsbie.cgg.gov.in ద్వారా మెమోలను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని సూచించారు.