• facebook
  • whatsapp
  • telegram

ఇంజినీరింగ్‌ విద్యార్థులకు ఉచిత ఆన్‌లైన్‌ శిక్షణ

ఈనాడు, అమరావతి: ఇంజినీరింగ్‌ పూర్తిచేసిన, చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు 40 రోజుల డేటా అనలిటిక్స్‌ కోర్సును ఆన్‌లైన్‌లో ఉచితంగా అందిస్తున్నట్లు ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఛైర్మన్‌ చల్లా మధుసూదన్‌రెడ్డి తెలిపారు. తాడేపల్లిలో  ఎక్సెలర్‌ సంస్థ ఆధ్వర్యంలో శిక్షణను చల్లా మధుసూదన్‌రెడ్డి, సంస్థ ఎండీ అర్జా శ్రీకాంత్‌ ఆన్‌లైన్‌ ద్వారా ప్రారంభించారు. శిక్షణకు ఇప్పటి వరకు 3,272 మంది ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకున్నట్లు సంస్థ ఎండీ శ్రీకాంత్‌ తెలిపారు.