• facebook
  • whatsapp
  • telegram

ఉన్నత పాఠశాలలకు గ్రేడ్‌లు

ఈనాడు, అమరావతి: ప్రభుత్వ ఉన్నత పాఠశాలల పనితీరును విశ్లేషించేందుకు పాఠశాల విద్యాశాఖ చర్యలు చేపట్టింది. పాఠశాలలను తనిఖీ చేసేందుకు ఆగస్టు 31లోపు కమిటీలను ఏర్పాటు చేస్తోంది. తరగతి బోధన, బోధనలో ఉపకరణాల వినియోగం, వర్చువల్‌, డిజిటల్‌ తరగతుల వినియోగం.. తదితర అంశాలను ఈ కమిటీలు పరిశీలించి నివేదిక అందించేలా పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ సోమవారం ఆదేశాలు జారీచేశారు. తనిఖీల ఆధారంగా ఆయా పాఠశాలలకు.. చాలా బాగుంది, బాగుంది, పర్వాలేదు, బాగోలేదు అనే నాలుగు రకాల గ్రేడింగ్‌లలో ఏదో ఒకటి ఇస్తారు.