• facebook
  • whatsapp
  • telegram

కేజీబీవీల్లో ప్రవేశ దరఖాస్తుల గడువు పొడిగింపు

ఈనాడు, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాల్లో ఇంటర్‌ మొదటి సంవత్సరంలో ప్రవేశానికి, 7, 8 తరగతుల్లో ఖాళీలున్న సీట్ల భర్తీకి దరఖాస్తు గడువును ఆగస్టు 20 వరకు పొడిగించినట్లు సమగ్ర శిక్ష రాష్ట్ర పథక సంచాలకుడు వి.చినవీరభద్రుడు ఓ ప్రకటనలో తెలిపారు. పేద, అనాథ, బడి బయటి బాలికలు మాత్రమే వీటికి వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాలని కోరారు.