• facebook
  • whatsapp
  • telegram

ప్రాథమికోన్నత విద్య ప్రణాళిక విడుదల

ఈనాడు, దిల్లీ: ఇంటి నుంచే ప్రాథమికోన్నత విద్య (ఆరు నుంచి ఎనిమిది తరగతులు)ను అభ్యసించేందుకు ఎన్‌సీఈఆర్‌టీ రూపొందించిన మరో ఎనిమిది వారాల క్యాలెండర్‌ను కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేశ్‌ నిశాంక్‌ పోఖ్రియాల్‌ ఆవిష్కరించారు. ఇప్పటికే విడుదల చేసిన నాలుగు వారాల ప్రణాళికకు ఇది అదనమని ఆయన తెలిపారు.