• facebook
  • whatsapp
  • telegram

కరోనా కాలంలో తొలి ప్రవేశ పరీక్ష ‘క్లాట్‌’

* 22న నిర్వహించేందుకు సమాయత్తం
ఈనాడు, హైదరాబాద్‌: కరోనా వైరస్‌ వ్యాప్తి తర్వాత దేశంలో నిర్వహిస్తున్న తొలి ప్రధాన ప్రవేశ పరీక్షగా కామన్‌ లా అడ్మిషన్‌ టెస్టు(క్లాట్‌) నిలవనుంది. దేశవ్యాప్తంగా 22 న్యాయ విశ్వవిద్యాలయాల కన్సార్షియం ఆధ్వర్యంలో ఆగ‌స్టు 22వ తేదీన పరీక్ష నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షను 67 ప్రాంతాల్లో నిర్వహిస్తామని తొలుత ప్రకటించారు. అనంతరం  కరోనా కారణంగా ఆన్‌లైన్‌లో క్లాట్‌ జరిపాలని నిర్ణయించిన కన్సార్షియం.. పరీక్ష జరిపే నగరాలు/పట్టణాల సంఖ్యను ఏకంగా 203కి  పెంచింది. దేశవ్యాప్తంగా అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సుల కోసం దాదాపు 68 వేల మంది, పీజీకి 9 వేల మంది దరఖాస్తు చేశారు.
తెలుగు రాష్ట్రాల్లో క్లాట్‌ జరిగే నగరాలు, పట్టణాలు
తెలంగాణ: హైదరాబాద్‌, ఖమ్మం, కరీంనగర్‌, వరంగల్‌, నిజామాబాద్‌, మహబూబ్‌నగర్‌
ఏపీ: అనంతపురం, చీరాల, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, టెక్కలి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం