• facebook
  • whatsapp
  • telegram

పాఠశాల విద్యార్థులకు.. ఆన్‌లైన్‌ తరగతులు

ఈనాడు, హైదరాబాద్‌: కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి పాఠశాల విద్యార్థులకు ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించాలని, ఇందుకోసం దూరదర్శన్‌ను వినియోగించుకోవాలని రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయించింది. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను ఖరారు చేయాలని, అన్ని ప్రవేశ పరీక్షల నిర్వహణకు ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించింది. డిగ్రీ, పీజీ చివరి సంవత్సరం పరీక్షల నిర్వహణలో కోర్టు ఆదేశాల మేరకు నడుచుకోవాలని నిర్ణయించింది.