• facebook
  • whatsapp
  • telegram

అక్టోబరు 5 నుంచి ఏయూ దూరవిద్య పరీక్షలు

ఏయూ ప్రాంగణం, న్యూస్‌టుడే: ఆంధ్ర విశ్వవిద్యాలయం దూర విద్యా కేంద్రం ఆధ్వర్యంలో పీజీ, వృత్తి విద్యా కోర్సుల పరీక్షలు అక్టోబరు 5 నుంచి నిర్వహించనున్నట్లు కేంద్రం సంచాలకులు ఆచార్య పి.హరిప్రకాష్‌ ఒక ప్రకటనలో తెలిపారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను ఆగ‌స్టు 5న విడుదల చేశారు. పరీక్ష ఫీజు చెల్లించేందుకు సెప్టెంబరు 14 తుది గడువు. రూ.300 అపరాధ రుసుముతో సెప్టెంబరు 21 వరకు చెల్లించవచ్చు. ఇతర వివరాలకు ఏయూ వెబ్‌సైట్‌ను సందర్శించాలన్నారు.